హిరమండలంలోని స్థానిక శివపార్వతుల ఆలయంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మార్గశిర మాసం తొలి పోలి పాడ్యమి సందర్భంగా ఆలయంలో విశేష పూజలను జరిగాయి. నిర్వహకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.