భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకుగాను ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నం మండలం కే ఎస్ కవిటి రెవెన్యూ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో భూ సర్వే చేపట్టినప్పటికీ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వివరించారు. సరిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.