టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి చెందిన పైల కరువమ్మ (62) మురుగు కాలువలో పడి మృతి చెందింది. బహిర్భూమికని వెళ్లిన ఈమె మూడురోజుల క్రితమే ప్రమాదానికి గురై మృతిచెందగా, ఆమె మృతదేహాన్ని గ్రామస్థులు ఆలస్యంగా సోమవారం రాత్రి గుర్తించారు. కరువమ్మకు భర్త, పిల్లలు లేరని, బందువులు సైతం తీర్ధయాత్రలకు వెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు. పంచాయతీ యంత్రాంగానికి సమాచారం అందించి స్థానికులే అంత్యక్రియలు నిర్వహించారు.