టెక్కలి లోని మండపొలం కాలనీలో నివసిస్తున్న ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు కోళ్ల పాపారావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించారు. తన మరణానంతరం శరీరాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పరీక్షలకు ఇస్తానని గతంలో ఆయన ధ్రువీకరించారు. ఈ మేరకు కుటుంబీకులు శ్రీకాకుళం మెడికల్ కళాశాలకి ఆయన భౌతికకాయాన్ని సోమవారం అప్పగించారు.