మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు: హోంమంత్రి

59చూసినవారు
మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు: హోంమంత్రి
AP: మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా.. లేదా గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి. దిశయాప్ ద్వారా ఎంత మంది మహిళలను రక్షించారో వైసీపీ సభ్యులే చెప్పాలి. శక్తి యాప్ తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించబోతున్నాం. మహిళా దినోత్సవం రోజున శక్తి యాప్‌ను సీఎం ప్రారంభించబోతున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్