TG: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ స్పందించారు. MLC ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడ్డారని అన్నారు. కొమురయ్య గెలుపు బీజేపీని మరింత బలపరుస్తుందని.. ఉత్తర తెలంగాణ బీజేపీ కంచుకోటగా మారిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. RRR డీపీఆర్ లోపభూయిష్టంగా ఉందని.. భూసేకరణ పూర్తికాకుండా టెండర్లకు ఎలా పిలుస్తారని మండిపడ్డారు.