AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని, లేదంటే 48 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా కొలికపూడి వ్యవహారంపై టీడీపీ అధిష్టానానికి నివేదిక అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కొలికపూడికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పద్దతి మార్చుకోకపోవడంతో ఆయనపై వేటు పడనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.