పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మాజీ మంత్రి కారుమూరి ఇంటి వద్ద వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాలంటూ వైసీపీ నేతలు నినాదం చేశారు. అత్తిలిలో మొత్తం 18 మంది ఎంపీటీసీలకు గాను వైసీపీ -14, టీడీపీ-2, జనసేనకు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.