2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల

71చూసినవారు
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరాన్ని గురువారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా తాము ముందుకెళ్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్