IPL-2025లో: టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేస్తున్న SRHకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్ ఐదో బంతికి రనౌట్‌గా అభిషేక్(1) వెనుదిరగగా, మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (2), డకౌట్‌గా నితీశ్‌కుమార్ రెడ్డి పెవిలియన్ కి చేరారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన SRH స్కోర్, మూడు ఓవర్లకు 29/3.