టీడీపీ హయాంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం రెండో విడతను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని జనవరి నుంచి ప్రారంభించనున్నారు. కాగా, వచ్చే ఐదేళ్లలో 17,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని, ప్రజల నుంచి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. వివరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు.