‘అమరన్’లోని ‘హే మిన్నలే’ పాటలో హీరోయిన్ ఓ కాగితంపై తన ఫోన్ నంబర్ రాసి హీరోకు ఇస్తుంది. ఆ నెంబర్ సాయిపల్లవిది అనుకొని అభిమానులు తనకు ఫోన్ చేస్తున్నారని చెన్నైకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విఘ్నేశన్ తెలిపాడు. దీని వల్ల వ్యక్తిగత ప్రశాంత కోల్పోయానని, రూ.1.1 కోటి పరిహారం కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదానికి కారణమైన నంబర్‌ను బ్లర్ చేసింది.