తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాట్సప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. ఈనెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. డేట్ అఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ లాంటి 150 సర్వీసులు వాట్సాప్ ద్వారానే పొందవచ్చని చెప్పారు. ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.