చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం వి. ఆర్. అగ్రహారం పంచాయతీలో సుకులాల్ కుంకుల్(26) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పలువురు కూలీలు మండలంలోని గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా పనులు చేస్తున్నారు. ఈక్రమంలో స్తంభాలపై తీగలు లాగుతుండగా విద్యుత్తు సరఫరా కావడంతో సుకులాల్ కింద పడి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.