తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. దీనివల్ల విద్యుత్ శాఖకు రూ. 15లక్షల నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదివారం తెలిపారు. జిల్లాలో 40 స్తంభాలు, 13 ట్రాన్స్ఫార్మర్లు, 1. 2 కిలోమీటర్ల కండక్టర్లు పాడయ్యాయన్నారు. ఐదు ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయని నగరి, కార్వేటినగరం, బంగారుపాళ్యం, పాలసముద్రం, గుడిపాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు.