చిత్తూరు చర్చి వీధిలో జరిగిన స్థల వివాదంపై 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎమ్మార్వో కళావతి బుధవారం తెలిపారు. పోలీసుల నివేదిక ఆధారంగా శాంతి భద్రతల దృష్ట్యా రెండు వారాలపాటు వివాదాస్పద స్థలం వద్ద ఇరు వర్గాల వారు వెళ్లరాదని ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల వారికి సమన్లు జారీ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామన్నారు.