తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ నామినేషన్

1883చూసినవారు
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ నామినేషన్
తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ లో పార్లమెంటు ఆర్వో కు నామినేషన్ పత్రం అందించారు. ఈయన గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పిడి డిఆర్డీఏ గా విశిష్ట సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ప్రధాన అజెండా గా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్