నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మంగళవారం కొడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని వెంకన్నపురంలో సాగులో ఉన్న పలువురి రైతుల పంట పొలాలను సందర్శించారు. వరి సాగులో ఎరువుల యాజమాన్యం కీలకమని తెలిపారు. వరి పంటలో వచ్చే తెగుళ్ళను ఎలా నివారించుకోవాలో రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మి, వ్యవసాయ సిబ్బంది, అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.