కోవూరు నియోజకవర్గం బుచ్చి మండలంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. ఇటీవల పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో భేటీ కావడంతో వారు టిడిపిలో చేరుతారని జోరుగా మండలంలో ప్రచారం జరుగుతుంది. ఆదివారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి బుచ్చిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె సమక్షంలో వారు టిడిపి కండువాలు కప్పుకోనున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.