కుప్పం రెస్కోలో జరిగిన అవినీతిపై చర్చకు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శనివారం ప్రశ్నించారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు. రెస్కోలో భారీ అవినీతి జరిగితే భరత్ కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. రెస్కో అక్రమాలపై కుప్పంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు.