థియేటర్లకు అనుమతి లేదంటూ కుప్పంలో రెండు థియేటర్లలో పుష్ప-2 సినిమాను నిలిపివేయడంపై అభిమానులు శనివారం స్పందించారు. సినిమా ఆపివేసిన విషయాన్ని కుప్పం నియోజకవర్గ అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షుడు బన్నీ వేలు హీరో అల్లు అర్జున్ స్నేహితుడు సందీప్ ద్వారా అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు. కుప్పంలో సినిమా నిలిపివేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.