ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్టు కుప్పం ఎంపీడీవో సాయి లహరి శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. పింఛన్ లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దనే ఉండి పింఛన్ నగదును అందుకోవాలని ఎంపిడిఓ సాయి లహరి విజ్ఞప్తి చేశారు.