నెల్లూరు: చౌక మద్యం కాదు.. చౌకగా విద్యుత్తు ఇవ్వండి: సిపిఎం
నెల్లూరు నగరంలో సోమవారం సిపిఎం 25వ మహాసభ ముగింపు సందర్భంగా బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రజలకు చౌక మద్యం కాదు, చౌక విద్యుత్ సరఫరా కావాలని డిమాండ్ చేశారు. ఇంధనం సర్దుబాటు చార్జీలతో 8,114 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేయడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే ఉపసంహరించుకోవాలని, నగర ప్రజలకు భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పథకం అందించాలని కోరారు.