పలమనేరు వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం కూలిపోయే స్థితికి చేరుకుంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్న ఈభవనం గోడ వెనుక వైపు పగుళ్లు ఏర్పడి బీటలు వారింది. ఎప్పుడు కూలుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. కాగా ఈ భవనంలోని వ్యవసాయ శాఖ అధికారిణి మరో గదిలో విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి ముందస్తుగా కార్యాలయం ఖాళీ చేయించి మరమ్మతులు చేపట్టాలని పలువురు మంగళవారం కోరారు.