పశువుల పట్ల ఓ యాజనానికి ఉన్న చొరవను చూస్తే శబాస్ అనాల్సిందే. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలోంచి పొద్దెక్కే వరకు బయటకు రావడంలేదు. రొంపిచర్ల ముత్యాలమ్మ గుడి వీధిలో ఉంటున్న మస్తాన్ 20 ఏళ్లుగా ఒంటెద్దు బండి పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆవు చలిలో ఇబ్బంది పడకుండా వినూత్న ఆలోచన చేశాడు. గోనె సంచులతో బట్ట మాదిరిగా కుట్టించిన పట్టను ఆవుకు తొడిగారు. ఎద్దు బాగుంటేనే నాకు జీవనమని అంటున్నాడు.