సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనివారం నందీశ్వరునికి మహా ప్రదోష పూజ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు కానుకలుగా సమర్పించిన పాలు పెరుగు కొబ్బరి నీరు, చందనాధులతో స్వామివారికి అభిషేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.