ప్రతి కుటుంబానికి వంద రోజులు ఉపాధి కల్పించాలని ఆ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా సి. వి శ్రీనివాసప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచించారు. ఏర్పేడు మండలం, నచ్చన్నేరి పంచాయతీలో జరుగుతున్న పెర్క్యూలేషన్ పనిని బుధవారం తనిఖీచేసి కూలీలకు ఉపాధితో కలుగు ప్రయోజనాలను తెలిపారు. అలాగే రైతులకు పళ్ళు, పూల తోటలూ పెంపకం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేటట్లు చూడాలని తెలిపారు.