శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో తుఫాన్ సందర్భంగా భారీ వర్షాలు కురిశాయి. సోమవారం నచ్చనేరి అడవుల్లోని మహానందీశ్వర స్వామి కోనలో జలపాతం కనువిందు చేస్తుంది. అక్కడికి వెళ్లిన స్థానికులు మాట్లాడుతూ. నచ్చనేని జలపాతం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు జలపాతం దృశ్యాలను చూడడానికి వెళుతున్నారు. అలాగే నందీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.