శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలని వారికి సూచించారు. ఈయన వెంట పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.