శ్రీకాళహస్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, అనర్థాలు, సైబర్ క్రైమ్ పై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీని డీఎస్పీ నరసింహమూర్తి జండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం అస్తవ్యస్తమవుతుందని డీఎస్పీ తెలిపారు. యువత వ్యసనాలకులోను కారాదన్నారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.