శ్రీకాళహస్తి మండలం తొండమాన్ పురంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబయింది. బుధవారం దేవస్థానాన్ని మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణాలు, చలువ పందిళ్లతో సుందరంగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.