నాయుడుపేట జాతీయ రహదారిపై బిరదవాడ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటో ను వెనక నుండి వచ్చిన బైక్ వేగంగా వచ్చి గుద్దడంతో ఆటో రోడ్డు పై పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి ఎటువంటి గాయాలు కాలేదు. బైక్ పై వచ్చిన వ్యక్తి మద్యం సేవించి డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఆటో వెనుక వైపు బాగా డామేజ్ అయ్యింది. నాయుడుపేట పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.