వెంకటగిరి పోలేరమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ శనివారం గింజలవీరయ్య కళ్యాణమండపంలో జరిగిన సమావేశంలో తెలిపారు. అధికారులతో పలు విషయాలపై చర్చించారు. అదేవిధంగా పట్టణ ప్రజలతోనూ, నాయకులతోను జాతర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మాట్లాడుతూ బయట నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.