దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందారు. రోహిణి అనే ప్రాంతంలోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ దగ్గర పీజీ భవనంలో ఈ ఘనట చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ వాసిగా.. మరొకరు ఢిల్లీలోని పాలెం కాలనీకి చెందిన నివాసిగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదా ఏదైనా గొడవ కారణంగా చనిపోయారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.