AP: వైసీపీ అధినేత జగన్‌కు తల్లి విజయమ్మ మరోసారి షాకిచ్చారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్‌లో వాటాలన్ని తన పేరిట బదిలీ అయ్యాయని చెప్పారుు. ఇందులో జగన్‌కు గానీ, భారతీరెడ్డికి కానీ వాటాల్లేవని చెప్పారు. ఇద్దరూ కలిసి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌కు విజయమ్మ తెలిపారు.