మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో ఉన్న సముద్రంలోని ఓ బోటులో అగ్నిప్రమాదం జరిగింది. పడవ 80 శాతం కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఆ పడవలో 18-20 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అక్కడి అధికారులు తెలిపారు. బోటులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.