వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

59చూసినవారు
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
మెరకముడిదాం మండలం సోమలింగాపురం షిరిడిసాయి ఆలయంలో ఆదివారం వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారికి విశేష ద్రవ్యాలతో ఆలయ పూజారి సూర్యనారాయణ శాస్త్రి మహా అభిషేకం చేశారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :