శ్రీకాకుళం: దత్తాత్రేయ స్వామి సేవలో.. చీపురుపల్లి ఎమ్మెల్యే

61చూసినవారు
శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి నది తీరాన కొలువైన శ్రీ చిమ్ సదానంద గణపతి ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన వెంట కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్