చీపురుపల్లి: రెండు మద్యం దుకాణాలకు 42 దరఖాస్తులు
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో నూతనంగా ఏర్పాటు కానున్న రెండు మద్యం దుకాణాలకు 42 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. కాగా ఈనెల 14 న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీయనున్నట్లు తెలిపారు.