సమాజానికి సేవలందిస్తున్న వైద్యుల భద్రత అందరి బాధ్యతని కోరపు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పి. స్రవంతి, డాక్టర్ కె. రఘు లు అన్నారు. కోల్ కతా లో వైద్య విద్యార్థి దారుణ హత్యకు నిరసనగా గురువారం వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైద్యులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక చర్యలు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.