ఈనెల 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుందని పశు సంవర్ధకశాఖ గంట్యాడ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు డాక్టర్ రెడ్డి కృష్ణ చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు నెలలు దాటిన ప్రతి పసుపు టీకాలు వేస్తామని, మండలంలో 3 టీములుగా ఏర్పడి ప్రతి గ్రామంలో సిబ్బంది వెళ్లి టీకాలు వేస్తారని చెప్పారు. పాడిరైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.