మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని మెంటాడ ఎంపీడీవో త్రివిక్రమ్ రావు సూచించారు. మెంటాడ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వేతనదారులకు ఉపాధి కల్పనతో పాటు పల్లెల అభివృద్ధికి దోహదపడే పనులను పరిగణలోనికి తీసుకోవాలన్నారు.