మెంటాడ: రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభం
మెంటాడ మండల కేంద్రంలోని సాలివీధిలో రోడ్డు మధ్యలో కరెంటు స్తంభంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మొదట స్తంభం ఏర్పాటు చేశారని ఆ తర్వాత సిమెంట్ రోడ్డు వేసినట్లు వెల్లడించారు. రోడ్డు వేసిన సమయంలో సమస్యను ప్రస్తావించగా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.