ఎన్నికల కోడ్ దృష్ట్యా అభివృద్ధి పనులపై చర్చించలేదు

55చూసినవారు
ఎన్నికల కోడ్ దృష్ట్యా అభివృద్ధి పనుల పై చర్చించలేదని కొత్తవలస సర్పంచ్ మచ్చ యర్రయ్య రామస్వామి అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులపై దృష్టి సారించలేదన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు సంబంధించిన సమస్యలను వార్డు సభ్యుల నుండి అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్