బొబ్బిలి గురుకుల పాఠశాలను మంగళవారం పరిశీలనకు గురుకుల పాఠశాలల సెక్రటరీ మస్తానయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డార్మెంటరీలను బాగు చేసేందుకు రూ. కోటి 22లక్షలతో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ రూమును పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.