ఉపాద్యాయులే సమాజ నిర్మాతలు: ఎంపిడిఓ

70చూసినవారు
ఉపాద్యాయులే సమాజ నిర్మాతలు: ఎంపిడిఓ
ఉపాద్యాయులు సామాజిక నిర్మాతలని సమాజ నైతికాభివృద్ది వారిపై ఆధారపడి వున్నదని బొబ్బిలి మండలం మండల అభివృద్ధి అధికారి రవి కుమార్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యంలో ఉపాధ్యాయులుగా వృత్తిని నిర్వహిస్తూ రోటరీ ద్వారా సమాజానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయ రొటేరియన్స్ ను సత్కరించే కార్యక్రమాన్ని ఎన్అర్ఐ హాస్పిటల్ సమావేశ హాల్లో క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్