చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామ శివార్లలో గురువారం కోడి పందాలు ఆడుతున్న వారిపై చీపురుపల్లి ఎస్సై ఎల్. దామోదర్, సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి ఆరు కోడిపుంజులు, 8 మొబైల్ ఫోన్లు, రూ. 15, 280ల నగదు స్వాధీనం చేసుకున్నారు.