ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన చీపురుపల్లి మండలం పేరిపిలో జరిగింది. గ్రామానికి చెందిన పి. అప్పలనాయుడు (45) శుక్రవారం సాయంత్రం సమీపంలోని పొలంలో ట్రాక్టర్ తో అతను దున్నుతుండగా ఒక్కసారిగా జారిపడ్డారు. దింతో తీవ్ర గాయాలు కాగా చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.