గుర్ల మండల కేంద్రంలో ఇటీవల అతిసార వ్యాధికి గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు బుధవారం పరామర్శించారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.