గరివిడి మండలం దువ్వాము గ్రామంలో గురువారం పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 6నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించి, పౌష్టికాహారంతో రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చుని తెలిపారు. పిల్లలకు బాలామృతంతో ఎటువంటి వంటలు చేసిపెట్టొచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో గరివిడి స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎమ్మార్వో, ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్ పాల్గొన్నారు.